O O Obulamma - Satya Yamini and PVNS Rohith Lyrics
| Singer | Satya Yamini and PVNS Rohith |
| Composer | M M Keeravani |
| Music | M M Keeravani |
| Song Writer | M M KeeravaniUp |
Lyrics
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
గీత రచయిత: యమ్.యమ్.కీరవాణి
గానం: సత్య యామిని, P V N S రోహిత్
నటీనటులు: వైష్ణవ తేజ్. రకుల్ ప్రీత్
సాకి:
F: గింజ గింజ గింజ మీద
బుసుక బుసుక బుసుక తీసి
తియ్యంగ బత్తెమై పోయే..
బొట్టే కట్టి చేతబట్టిన చేతిలోకి చేరాలని గుండుజల్ల ఆరాట పడిపోయే..
పల్లవి:
ఓ ఓ ఓబులమ్మా!
బొమ్మకర్ర మేణి ఛాయ ముద్దుగుమ్మా..
కపర కపర రేతిరిలోన.. కాలమంత లెక్కలుగట్టి..
గుండెలోనె నీ పేరు జపమాయే
ఇదివరకెపుడు తెలియని ఎరగని
తురుపే మైమరపిస్తు ఉంటే
కంటికేమొ కునుకే దూరపు చుట్టమాయే
చరణం:
కన్నులు కన్నులు వింటున్న..
చూపులు చూపులు చెబుతున్నా..
మాటల మాటలు చూస్తున్న మగతలలో..
ఎవ్వరికెవ్వరు సావాసం.. ఎక్కడికక్కడ ప్రయాణం
ఎప్పటికప్పుడు ఎదురయ్యే.. మలుపులలో
F: చదివేసాడేమో నా కలలూ.. ఉంటాడె నీడై రేపవలూ
తిష్టేసినాడే గోంతరాలు.. పొమ్మంటె పోడే ఈడిగలూ
పల్లవి:
M: ఓ ఓ ఓబులమ్మా!
పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మా
F: కపర కపర రేతిరిలోన.. కాలమంత లెక్కలుగట్టి..
గుండెలోనె నీ పేరు జపమాయే
ఇదివరకెపుడు తెలియని ఎరగని..
తలపే మైమరపిస్తు ఉంటే
కంటికేమొ కునుకె దూరపు చుట్టమాయే
M: ఓ ఓ ఓబులమ్మా!
బొమ్మకర్ర మేణి ఛాయ ముద్దుగుమ్మా
ఓ ఓ ఓబులమ్మా!
పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మా
Comments
Post a Comment