Baguntundi nuvvu navvithe - Sid Sri Ram and Nutana Mohan Lyrics
| Singer | Sid Sri Ram and Nutana Mohan |
| Composer | Shekar Chandra |
| Music | Shekar Chandra |
| Song Writer | Bhaskara bhatla |
Lyrics
Pallavi:
M: బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే
బాగుంటుంది నిన్ను తాకితే
బాగుంటుంది నువ్వు ఆపితే
బాగుంటుంది కంటికున్న కాటుకంతా ఒంటికంటితే
F: అహహా బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా..
లాలిస్తే తగ్గిపోతుంది బహుశా..
ఈ మనసు ప్రేమ బానిస..
M: అయితే బుజ్జగించుకుంటాలే..
నిన్నే నెత్తినెట్టుకుంటానే..
నువ్వే చెప్పినట్టు వింటానే..
చెలి చెలి జాలి చూపవే
Charanam 1:
M: తడి చేసేద్దాం పెదవులని..
ముడి వేసేద్దాం మనసులని..
దాచేసుకుందాం మాటలని..
దోచేసుకుందాం హాయిని..
F: కాదంటానేంటి చూస్తూనే చొరవ..
వద్దన్నకొద్దీ చేస్తావు గొడవ
నీ నుంచినేను తప్పుకోడం సులువా..
కౌగిళ్ళలోకి లాగవా..
M: అమ్మో నువ్వు గడుసు కదా..
అన్నీ నీకు తెలుసు కదా..
అయినా బైట పడవు కదా..
పదా పదా ఎంత సేపిలా..
Charanam 2:
M: వెలివేసేద్దాం వెలుతురుని..
పరిపాలిద్దాం చీకటిని..
పట్టించుకుందాం చెమటలని..
చుట్టేసుకుందాం ప్రేమని..
F:నువ్వేమో పెడుతుంటే తొందరలు..
నాలోని సిగ్గు చిందర వందరలు..
అందంగా సర్దుకోనా ముంగురులు..
మూసావు అన్ని దారులు..
M:కొంచెం వదిలానంటే నిన్నిలా ..
మొత్తం జారిపోవా వెన్నెలా..
వేరే దారి లేక నేనిలా..బంధించానె అన్ని వైపులా..
M:బాగుంటుంది నువ్వు నవ్వితే..
బాగుంటుంది ఊసులాడితే..
బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే..
Pallavi:
M: Baguntundhi nuvvu navvithe..
baguntundhi oosuladithe..
Baguntundhi gunde meedha guvvalaga nuvvu valithe..
Baguntundhi ninnu thakithe..
Baguntundhi nuvvu aapithe..
Baguntundhi kantikunna katukantha vontikantithe
F: Ahaha bagundhi varasa..
Nee meedha kopam enthundo telusaa..
Laalisthe thaggipothundhi bahushaa..
Ee manasu prema baanisaa..
M: Aithe bujjaginchukuntale..
Ninne netthi nettukuntane..
Nuvve cheppinattu vintane..
Cheli cheli jaali choopave
Charanam 1:
M: Thadi cheseddham pedhavulani..
Mudi veseddham manasulani.. Dachesukundham matalani..
Dochesukundham hayini..
F: Kadhantanenti chusthune chorava..
Vaddhanna koddhi chesthavu godava..
Nee nunchi nenu thappukodam suluvaa.. kougillaloki lagavaa..
M: Ammo nuvvu gadusu kadha..
Anni neeku thelusu kadha..
Ainaa bayata padavu kadha..
Padhaa padhaa entha sepilaa..
Charanam 2:
M: Velivesaddham veluthuruni..
Paripaliddham cheekatini..
Pattinchukundham chematalani..
Chuttesukundham premani..
F: Nuvvemo peduthunte thondaralu..
Naloni siggu chindara vandharalu..
Andhamgaa sardukonaa mungurulu..
moosavu anni daarulu..
M: Konchem vadhilanante ninnilaa..
mottham jaaripovaa vennela..
Vere dhaari leka nenilaa..
Bandhinchane anni vaipulaa..
M: Baguntundhi nuvvu navvithe.. Baguntundhi oosuladithe..
Baguntundhi gunde meedha guvvalaga nuvvu valithe..
Comments
Post a Comment